
న్యూఢిల్లీ: ఢిల్లీలోని అక్షర్ ధామ్ మెట్రో స్టేషన్ బిల్డింగ్ పై నుంచి దూకి ఓ యువతి(25) ఆత్మహత్యకు యత్నించింది. సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆ సమయంలో చాకచక్యంగా వ్యవహరించి ఆమెను కాపాడారు. గురువారం ఉదయం యువతి బిల్డింగ్ టెర్రస్ పైకి ఎక్కి దూకడానికి సిద్ధపడింది. ఆమెను గమనించి సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఒకరు వెంటనే తన కొలీగ్స్ కు సమాచారం అందించాడు. బిల్డింగ్ పై నుంచి దూకవద్దని రిక్వెస్ట్ చేసినా.. ఆ యువతి పట్టించుకోలేదు. ఇంతలో ఆ యువతి దూకే ప్లేస్లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది బ్లాంకెట్ పట్టుకొని నిల్చోవడంతో ఆమె చిన్న గాయాలతో బయటపడింది. ఆమె కాళ్లకు దెబ్బలు తగలడంతో ఆస్పత్రిలో చేర్పించారు.