64 ఏండ్ల వ్యక్తికి 73 ఏండ్ల జైలు శిక్ష

64 ఏండ్ల వ్యక్తికి 73 ఏండ్ల జైలు శిక్ష

ఇడుక్కి: మనవడిపై లైంగిక దాడికి పాల్పడిన 64 ఏండ్ల వ్యక్తికి కేరళ సెషన్స్ కోర్టు 73 ఏండ్ల జైలు శిక్ష విధించింది. ఏడేండ్ల చిన్నారిపై 2019లో చేసిన నేరానికిగాను ఆ ప్రబుద్ధుడిని దోషిగా నిర్ధారించింది. నిందితుడు తన మనవడిని పలుమార్లు లైంగికంగా వేధించినట్లు, దాడికి పాల్పడినట్లు ఇడుక్కి ఫాస్ట్ ట్రాక్ కోర్టు తేల్చింది. పోక్సో చట్టం కింద ఒక్కోనేరానికి 20 ఏండ్ల చొప్పున, సెక్షన్ 377 ప్రకారం పదేండ్లు, పిల్లల పట్ల క్రూరంగా ప్రవర్తించినందుకు మూడేండ్లు కలిపి మొత్తం 73 ఏండ్ల జైలు శిక్ష విధించింది. అయితే, శిక్షలు ఏకకాలంలో అమలవుతాయి కాబట్టి దోషి 20 ఏండ్ల పాటు జైళ్లో ఉంటాడని తెలిపింది.