కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఏడు రోజుల వయసున్న పసికందు విక్రయానికి సంబంధించిన కేసు కలకలం రేపింది. శిశువును కొనేందుకు బేరం అతా కుదిరినాక.. పేమెంట్ చెల్లింపులో చోటుచేసుకున్న వివాదంతో ఘటన బయటపడింది.
కరీనంగర్ టూటౌన్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఓ శిశువును 9 లక్షల రూపాయలకు కొనుగోలు చేసేందుకు కొందరు వ్యక్తులు ఒప్పందం చేసుకున్నారు. అయితే డబ్బులు ఇచ్చే విషయంలో తేడా రావడంతో విషయం బయటికి వచ్చింది. ఈ ఘటనలో 15 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
గన్నేరువరం మండలం కాసింపేట సమీపంలోని చాకలివాని పల్లకి చెందిన దంపతులు ఈ శిశువిక్రయానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. లావాదేవీల పంపిణీలో వచ్చిన వివాదంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. విక్రయానికి గురైన శిశువు (బాలుడు)ను వైద్య పరీక్షల కోసం కరీంనగర్ మాత శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు పోలీసులు.
