
ఆ యువతి ఎంబీఏ చేసి.. బ్యాంకులో ఉద్యోగం సాధించి కెరీర్ లో గెలిచింది. గౌరవ ప్రదమైన ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అండగా నిలబడింది. కానీ జీవితంలో ఓడింది. ప్రేమించిన వాడు నిరాకరించాడని ఆత్మహత్యకు పాల్పడటంతో ఆ ఊరిలో, ఆ కుటుంబంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.
ఈ ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తాళ్లపల్లి తండాలో జరిగింది. తండాకు చెందిన సక్కుబాయి ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. ప్రేమ విఫలమైందని మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. మూడు రోజులుగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చివరికి మృతి చెందింది.
సంగారెడ్డిలో పనిచేస్తున్న కానిస్టేబుల్ సిద్ధూ, సక్కుయాయి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. సిద్ధూ ప్రేమ నిరాకరించడంతో మనస్థాపానికి చెందిన సక్కుబాయి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.