హైకోర్టు భిన్నమైన తీర్పులు ఎలా ఇస్తుంది:సుప్రీంకోర్టు

హైకోర్టు భిన్నమైన తీర్పులు ఎలా ఇస్తుంది:సుప్రీంకోర్టు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుల పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక కామెంట్స్ చేసింది జస్టిస్ గవాయి నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం. ఫాంహౌజ్ కేసులో హైకోర్టులో భిన్నమైన తీర్పులు ఎలా ఇస్తుందని సుప్రీం ప్రశ్నించింది. బెయిల్ పిటిషన్ వేసి ఉంటే ఈ రోజే విడుదల చేసేవాళ్లమని జస్టిస్ గవాయి, జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కేసులో మెరిట్ ఆధారంగా విచారణ జరపాలని ట్రయల్ కోర్టుకు సూచనలు చేసింది సుప్రీం. ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 7వ తేదీకి వాయిదా వేసింది. 

ఈ కేసు విచారణ సందర్భంగా నిందితుల తరపు లాయర్ తమ వాదనలు వినిపించారు. టీఆర్ఎస్,-బీజేపీ మధ్య జరుగుతున్న యుద్ధంతో తాను బలవుతున్నామని చెప్పుకొచ్చారు. పోలీసులు పక్షపాతంతో దర్యాప్తు చేస్తున్నారన్నారు. మెజిస్ట్రేట్ నిందితులకు రిమాండ్ తిరస్కరించారని, అయితే రెండ్రోజుల్లోనే హైకోర్టులో తీర్పు మారిందని సుప్రీం దృష్టికి తీసుకొచ్చారు.  దీనిపై వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం.. కేసును ఈ నెల ఏడుకు వాయిదా వేసింది.