రోడ్డుపైన పెద్ద గుంత..వాహనాల రాకపోకలకు అంతరాయం

రోడ్డుపైన పెద్ద గుంత..వాహనాల రాకపోకలకు అంతరాయం

నవీపేట్, వెలుగు : నవీపేట్ మండలంలోని అయ్యప్ప టెంపుల్ వద్ద రోడ్డుపైన పెద్ద గుంత పడింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. శివ తాండ మట్టాయి ఫారం అబ్బపూర్ బి తాండ మద్దేపల్లి గ్రామాలకు వెళ్లే ఈ దారిలో శనివారం నుంచి కురుస్తున్న వర్షానికి గుంత ఏర్పడింది.

నిజాంసాగర్ డి 50 కెనాల్  పై నుంచి రోడ్డు ఉండటం అక్కడే గత సంవత్సరం గుంత ఏర్పడగా గ్రామస్థులు ముసివేశారు.  మళ్లీ అదే ప్రాంతంలో గుంత పడటం వల్ల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇప్పటికైనా గుంతను పూడ్చి బ్రిడ్జిను నిర్మించాలని కోరుతున్నారు.