ట్విట్టర్ ఇజ్జత్ తీసిన మస్క్..వెయ్యి మంది ఫాలోవర్లు లేనోళ్లకు బ్లూ టిక్

 ట్విట్టర్ ఇజ్జత్ తీసిన మస్క్..వెయ్యి మంది ఫాలోవర్లు లేనోళ్లకు బ్లూ టిక్

 ట్విట్టర్ బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ అట్టర్ ఫ్లాప్ అయింది. ట్విట్టర్ బ్లూ టిక్ సర్వీస్ సబ్‌స్క్రైబర్‌లలో సగం మంది వెయ్యి కంటే తక్కువ మంది ఫాలోవర్లను కలిగి ఉన్నారని ఒక నివేదిక వెల్లడించింది.  బ్లూ టిక్ కోసం డబ్బులు చెల్లిస్తే చాలు.. ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ బ్లూటిక్ ఇచ్చేస్తున్నాడు. దీంతో ప్రతి యూజర్ మనీ పే చేస్తూ..బ్లూ టిక్ పొందుతూ..సెలబ్రిటీలా ఫీలవుతున్నాడు. ఇలాంటి వారు కనీసం వెయ్యి మందికి ఫాలోవర్లకు కూడా లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ట్విట్టర్ నిబంధనలపై ఇతర యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
  
ట్విట్టర్ బ్లూటిక్ పై మాషబుల్ అనే సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం జీరో ఫాలోవర్లను కలిగిన  2270 మంది  ట్విటర్ బ్లూ టిక్ ను కల్గిఉన్నారని వెల్లడించింది.  ట్రావిస్ బ్రౌన్ అనే  పరిశోధకుడి ప్రకారం ట్విట్టర్ బ్లూ టిక్ ప్రస్తుతం 444435 చెల్లింపు చందాదారులు కలిగి ఉన్నారు. ఇందులో సగం మంది అంటే సుమారు 220132 మంది యూజర్లు.. 1000 కంటే తక్కువ మంది ఫాలోవర్లను కలిగి ఉండగం గమనార్హం. 

మాషబుల్ నివేదిక ప్రకారం..దాదాపు 78059 మంది ట్విటర్ బ్లూ టిక్ సబ్ స్కైబర్లు ..100 మంది కంటే తక్కువ ఫాలోవర్లు కలిగి ఉన్నారు. మొత్తం ట్విటర్ బ్లూ చందాదారుల్లో  17.6 శాతం వీళ్లే ఉన్నారని మాషబల్ పేర్కొంది. అయితే  ప్రస్తుతం ట్విటర్ బ్లూ టిక్ కోసం ఎంత మంది డబ్బులు చెల్లించడం లేదో తెలియదు. మరోవైపు గతంలో బ్లూ టిక్ కలిగిన వారు..నిబంధనలు మారిన తర్వాత బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ చేసుకోలేదు.  అయితే వారి బ్లూ టిక్ను ట్వి్ట్టర్ తీసేయలేదు. ఇప్పటికే ఇలాంటి  యూజర్ల ఖాతాకు బ్లూ టిక్ ఉండటం విశేషం. 

ట్విట్టర్ ప్రస్తుతం 254 మిలియన్ల యూజర్లు రోజు యాక్టివ్లో ఉంటారు.  ఇందులో  కేవలం 0.2 శాతం మంది మాత్రమే ట్విట్టర్ బ్లూ టిక్  కోసం డబ్బులు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం 4,20,000 లెగసీ వెరిఫైడ్ ఖాతాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా ప్రముఖులు, క్రీడాకారులు, పాత్రికేయులు, ప్రభావశీలులు మరియు ఇతర ప్రముఖ వినియోగదారులు ఉన్నారు.  అయితే  ఏప్రిల్ 1 నుండి డబ్బులు చెల్లించని సబ్ స్క్రైబర్ల ఖాతాలకు లెగసీ  బ్లూ టిక్లను తొలగిస్తున్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించారు.