మంచిర్యాలలో బైక్ ను ఢీ కొట్టిన బొలెరో.. ఇద్దరు స్పాట్ డెడ్

మంచిర్యాలలో  బైక్ ను ఢీ కొట్టిన బొలెరో.. ఇద్దరు స్పాట్ డెడ్

మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  జన్నారం  మండలం  మొర్రిగూడలో బైక్ ను ఢీ కొట్టింది బొలెరో వాహనం. ఈ ఘటనలో బైక్ పై వెళ్తోన్న ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. 

మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదంతో రోడ్డుపై కాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి.  స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు.. మృతి చెందిన వారు  ఉట్నూర్ చెందిన వారిగా గుర్తించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని నిర్ధారణకు వచ్చారు పోలీసులు. డ్రైవింగ్ చేస్తున్న వారు మద్యం సేవించి ఉన్నారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.