సర్పంచ్ ఎలక్షన్లకు జోరుగా నామినేషన్లు వేస్తున్నారు అభ్యర్థులు..మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు నానమినేషన్ల గడువు మగియడంతో రెండో ఫేజ్ కు నామినేషన్లు వేస్తున్నారు. అభ్యర్థులు వెరైటీ హామీలతో ప్రచారం చేస్తున్నారు అభ్యర్థులు. ఎన్నికల్లో తనను గెలిపిస్తే గ్రామంలో ఆడపిల్ల పుడితే రూ. 2 వేలు ఆర్థిక సాయం, తీజ్ పండుగకు రూ. 20 వేలు, ముదిరాజ్ బోనాల పండుగకు రూ.8 వేలు, ఎల్లమ్మ బోనాల పండుగకు రూ.3 వేలు విరాళం, గ్రామంలో ఎవరైనా అకాల మరణం చెందితే వారికి అంత్యక్రియల కోసం రూ.5 వేల ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. వాటిని అమలు చేయకుంటే తనను జిల్లా కలెక్టర్ ద్వారా కానీ, జిల్లా న్యాయస్థానం ద్వారా గాని సర్పంచ్ పదవి నుంచి తొలగించుకోవచ్చని పేర్కొన్నారు. మౌనిక హామీలతో రాయించిన బాండ్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కుల, మహిళా, యువజన సంఘాల నుంచి గంప గుత్తగా ఓట్లు రాబట్టేందుకు అభ్యర్థులు బేరసారాలు మొదలు పెట్టారు. ‘ఓట్లన్నీ మాకే వేయండి.. మీకు కావాల్సినవన్నీ చేస్తాం” అంటూ కుల పెద్దలతో సీక్రెట్ మీటింగ్స్ పెడుతున్నారు.హవేలీ ఘన్ పూర్ మండలం రాజుపేట తండా, కాప్రాయిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థి కుక్కల మౌనిక ఓటర్లకు 15 హామీలు 100 రూపాయల బాండ్ పేపర్ పై రాసిచ్చారు.
ఒకప్పుడు సర్పంచ్ ఎలక్షన్లకు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలకు మధ్య చాలా తేడా కనిపిస్తున్నది. గతంలో సర్పంచ్ ఎలక్షన్స్‌కు పెద్దగా ఖర్చు పెట్టకపోయేవారు. కానిప్పుడు చిన్న పంచాయతీలోనూ ఖర్చు రూ.10 లక్షలు దాటుతున్నది. మేజర్ పంచాయతీలైతే కోటి దాటుతున్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు సర్పంచ్ పదవిని స్టేటస్ సింబల్‌గా భావిస్తుండటంతో ఖర్చుకు వెనకాడడడం లేదు. కొందరు అభ్యర్థులు శుభకార్యాలకు, చావులకు అవసరమయ్యే టెంట్ హౌస్ సామాను కొని గ్రామ పంచాయతీకి అప్పగిస్తూ ఓటు తనకే వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
