హైదరాబాద్ లో గాంధీ ఆస్పత్రి వద్ద బాలుడు మిస్సింగ్

హైదరాబాద్ లో గాంధీ ఆస్పత్రి వద్ద బాలుడు మిస్సింగ్
  • నాలుగు నెలలు గడిచినా దొరకని ఆచూకీ
  • చిలకలగూడ పోలీసులకు బాలుడి తల్లి ఫిర్యాదు

పద్మారావునగర్, వెలుగు : గాంధీ ఆస్పత్రి మెట్రో స్టేషన్​వద్ద నాలుగు నెలల కిందట ఓ బాలుడు తప్పిపోగా ఇంతవరకు ఆచూకీ దొరకలేదు. చిలకలగూడ ఎస్ఐ కిషోర్​తెలిపిన వివరాల ప్రకారం.. సిటీకి చెందిన గౌసియా, ఎల్లేశ్​ దంపతులకు నలుగురు కుమారులు. వీరు మూడో కుమారుడు షేక్​అబ్బాస్ అనారోగ్యంతో బాధపడుతుండగా​ట్రీట్ మెంట్ కోసం నాలుగు నెలల కిందట గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు.

అక్కడే గాంధీ మెట్రోస్టేషన్ వద్ద బిక్షాటన చేసుకుంటూ దంపతులు జీవిస్తున్నారు. గత జూలై1న తమ రెండో కొడుకు  వివేక్ అన్ను(6)  తోటి పిల్లలతో ఆడుకుంటూ తప్పిపోయాడని తల్లి గౌసియా సోమవారం చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ కొడుకు కోసం ఎక్కడ వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో ఫిర్యాదు చేశామని బాలుడి తల్లి తెలిపినట్లు ఎస్ఐ చెప్పారు.