జనగామ జిల్లాలో దారుణం.. భర్తను కడతేర్చిన ఇద్దరు భార్యలు !

జనగామ జిల్లాలో దారుణం.. భర్తను కడతేర్చిన ఇద్దరు భార్యలు !

జనగామ జిల్లా: జనగామ జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు భార్యలు కలిసి భర్తను కడతేర్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. లింగాల గణపురం మండలం ఎనబావిలోని, పిట్టలోనిగూడెంలో ఈ ఘటన జరిగింది. కాలియా కనకయ్య(30)కు శిరీష, గౌరమ్మ అనే ఇద్దరు భార్యలు. ఈ ఇద్దరూ అక్కాచెల్లెళ్లు కావడం గమనార్హం. అత్తను హత్య చేసిన కనకయ్య ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చాడు.

కాపురానికి వెళ్లకుండా తల్లి ఇంట్లోనే శిరీష, గౌరమ్మ ఉంటున్నారు. దీంతో.. భర్తకు, తన ఇద్దరు భార్యలకు మధ్య గొడవలు తలెత్తాయి. మద్యం మత్తులో సోమవారం రాత్రి భార్యల దగ్గరకు గొడ్డలితో చంపుతానని కనకయ్య వెళ్లాడు. ఇద్దరు భార్యలు కలిసి కొట్టడంతో కనకయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకొని, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.