మండుతున్న ఎండలకు కాలిపోయిన కారు

 మండుతున్న ఎండలకు కాలిపోయిన కారు

గద్వాల, వెలుగు : మండుతున్న ఎండల కారణంగా గద్వాల పట్టణంలోని ఓ కారు దగ్ధమైంది. స్థానికుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా డోన్ పట్టణానికి చెందిన అమానుల్లా ఖాన్ గురువారం సొంత పని మీద గద్వాలకు వచ్చాడు. పట్టణంలోని భీమ్ నగర్ కాలనీలో ఉన్న ఓ హోటల్ వద్ద ఎండలో కారు నిలిపి భోజనానికి వెళ్లాడు. తిరిగి కారు వద్దకు చేరుకోగా, కారు నుంచి  దట్టమైన పొగలు రావడం గమనించాడు. కొద్దిసేపటికే మంటలంటుకోగా  స్థానికుల సాయంతో ఆర్పే ప్రయత్నం చేశాడు. ఫలితం లేకపోవడంతో ఫైర్ స్టేషన్ కు సమాచారమిచ్చాడు. దీంతో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. ఈ లోపు కారు పూర్తిగా కాలిపోయింది.