చెన్నై వరదల్లో కొట్టుకుపోతున్న కార్లు

చెన్నై వరదల్లో కొట్టుకుపోతున్న కార్లు

చెన్నై సిటీని కుండపోత వర్షాలు.. అల్లకల్లోలం చేస్తున్నాయి. తుఫాన్ మిచాంగ్ తీవ్రత ఎక్కువగా ఉంది. చెన్నై మహానగరంలో కురుస్తున్న వర్షాలకు చెరువులు పొంగి పొర్లుతున్నాయి. వీధులు జల మయం అయ్యాయి. కాలనీల్లోకి వరద పోటెత్తింది. దీంతో రోడ్లపై ఉన్న కార్లు కొట్టుకుపోయాయి. కాలనీల్లో మనిషి లోతు నీళ్లు వచ్చి చేరాయి. వరద పోటుకు.. కార్లు, బైక్స్ అన్ని కొట్టుకుపోతున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

2023, డిసెంబర్ 4వ తేదీ తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షాలు పడుతుండటంతో.. చెన్నై సిటీ అల్లకల్లోలంగా మారింది. మెయిన్ రోడ్లపై వర్షపు నీళ్లతో ట్రాఫిక్ స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ఇళ్లల్లోకి నీళ్లు ఇబ్బంది పడుతున్నారు జనం.

మరో వైపు భారీ వర్షాల కారణంగా పలు నగరాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. అంతేగాకుండా  డిసెంబర్ 4న  దాదాపు 11 విమానాలను కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA)కి మళ్లించారు. చెన్నైలో దిగాల్సిన దేశీయ ,  అంతర్జాతీయ విమానాలను KIA కి మళ్లించినట్లు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు ధృవీకరించారు. మైచాంగ్ తుఫాను కారణంగా చెన్నై విమానాశ్రయం వరదలతో నిండిపోయింది.