టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్(The Family star). దర్శకుడు పరశురామ్(Parasuram) తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది మంచి విజయాన్ని సాధించింది. ఫ్యామిలీ ఎమోషన్స్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్ నుండి మంచి ఆధరణ లభిస్తోంది. అయితే.. కొంతమంది మాత్రం సోషల్ మీడియా గ్రూప్స్ లో కావాలని ఈ సినిమాపై నెగిటీవ్ స్ప్రెడ్ చేస్తున్నారు. రిలీజ్ కు ముందే నుండే ఈ విదంగా నెగిటివ్ పోస్టులు చేశారు కొంతమంది.
అవి కాస్తా చిత్ర నిర్మాణ సంస్థ దృష్టికి వెళ్లడంతో సైబర్ క్రైమ్ పోలీసుల ఆశ్రయించారు. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల స్క్రీన్ షాట్స్, ఆ అక్కౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేసుకొని విజయ్ దేవరకొండ మేనేజర్ అనురాగ్ పర్వతనేని, విజయ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నిషాంత్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కావాలని కొందరు ఫ్యామిలీ స్టార్ సినిమాపై దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారి వల్ల సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకు తప్పుడు సమాచారం వెళ్తోందని, అది సినిమా వసూళ్లపై ప్రభావం చూపిస్తోందని ఫిర్యాదులో తెలిపారు. ఇందులో భాగంగా వారు అందించిన ఆధారాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారన జరిపి నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.