
అంగన్ వాడీ స్కూల్‌లో పాము కాటుకు గురై చిన్నారి చనిపోయిన ఘటన సిద్ధిపేట జిల్లాలో జరిగింది. గజ్వేల్ మండలం బయ్యారం గ్రామంలోని అంగన్‌వాడీ స్కూల్‌లో ఉదయం చిన్నారి నిత్యశ్రీని విడిచి వెళ్లాడు తండ్రి. ఆ తర్వాత స్కూల్‌లో పాము కాటుకు గురై చనిపోయింది. పాము కరిచినా తల్లికి చెప్పకుండా దాచారని, కాటు వేసిన చోట పసుపు రాసి చిన్నారిని బెదిరించి పడుకోబెట్టారని ఆరోపిస్తున్నారు గ్రామస్థులు. అంగన్‌వాడీ నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే నిత్యశ్రీ చనిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.