శంషాబాద్లో వీధికుక్కల దాడిలో చిన్నారి మృతి

శంషాబాద్లో వీధికుక్కల దాడిలో చిన్నారి మృతి

రంగారెడ్డి:శంషాబాద్ లో దారుణం జరిగింది. వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందాడు. రాత్రి గుడిసెలో నిద్రిస్తున్న సమయంలో వీధికుక్కలు ఏడాది వయసున్న చిన్నారి(నాగరాజు) పై దాడి చేశాయి. తీవ్ర గాయాలతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్నారి తల్లిదండ్రుల స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర. బతుకు దెరువు కోసం శంషాబాద్ వచ్చి సామా ఎన్ క్లేవ్ సమీపంలో గుడిసెలో నివాసముంటున్నారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీమున్నీరయ్యారు . నిన్న అర్థరాత్రి సామా ఎన్ క్లేవ్ సమీపంలో ఈ ఘటన జరిగింది.