ఫిలిప్పీన్స్‌ సరుకు రవాణా నౌకను ఢీకొట్టిన చైనా కోస్ట్‌గార్డ్‌ షిప్‌

ఫిలిప్పీన్స్‌ సరుకు రవాణా నౌకను ఢీకొట్టిన చైనా కోస్ట్‌గార్డ్‌ షిప్‌

మనీలా : ఫిలిప్పీన్స్‌తో చైనా మరోసారి గిల్లికజ్జాలు పెట్టుకుంది. తాజాగా ఫిలిప్పీన్స్‌కు చెందిన ఓ సరుకుల రవాణా నౌకను చైనా కోస్ట్‌ గార్డ్‌ షిప్‌ ఢీకొట్టింది. ఉద్దేశపూర్వకంగానే చైనా నౌక ఇలా చేసిందని మనీలా ఆరోపించింది. ఫిలిప్పీన్స్‌కు చెందిన నౌక సెకండ్‌ థామస్‌ షోల్‌ వద్దకు వెళ్తుండగా..  చైనా కోస్ట్‌ గార్డ్స్‌ ప్రమాదకర రీతిలో అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అది తమ నౌకా సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలో పడేసిందని ఫిలిప్పీన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

మరోవైపు..  చైనా ఈ ఘటనపై స్పందిస్తూ.. ఫిలిప్పీన్స్‌ ఉద్దేశపూర్వకంగానే సమస్యను పెంచాలని చూస్తోందని ఆరోపించింది. థామస్‌ షోల్‌లోని ఫిలిప్పీన్స్‌ ఔట్‌పోస్టులో ఉన్న బలగాలకు రేషన్‌ సరఫరా చేసే క్రమంలో ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. మరోవైపు ఆదివారం (అక్టోబర్​ 22న) ఉదయం చైనాకు చెందిన మిలీషియా నౌక ఫిలిప్పీన్స్‌ గస్తీ నౌకను ఢీకొంది.