
మకే: ఆస్ట్రేలియా అండర్19 జట్టుతో రెండు టెస్టుల యూత్ సిరీస్‌ను ఇండియా కుర్రాళ్లు క్లీన్‌స్వీప్ చేశారు. రెండ్రోజుల్లోనే ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లోనూ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. దాంతో 2–0తో సిరీస్‌ను సొంతం చేసుకున్నారు.
ఓవర్‌నైట్ స్కోరు 144/7తో బుధవారం (అక్టోబర్ 08) ఆట కొనసాగించిన ఇండియా అండర్–19 టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 171 రన్స్‌కు ఆలౌటైంది. ఫలితంగా 36 రన్స్ ఆధిక్యం దక్కించుకుంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌కు వచ్చిన ఆసీస్ 40.1 ఓవర్లో 116 స్కోరుకే కుప్పకూలింది.
అలెక్స్ లీ యంగ్ (38) టాప్ స్కోరర్. జట్టులో నలుగురు బ్యాటర్లు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేశారు.హెనిల్ పటేల్, నమన్ పుష్పక్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. ఉధవ్ మోహన్ రెండు వికెట్లు తీశాడు.
అనంతరం 81 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇండియా 12.2 ఓవర్లలోనే 84/3 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. వేదాంత్ త్రిదేది (33 నాటౌట్), విహాన్ మల్హోత్రా (21) రాణించారు.