పవన్‌ కల్యాణ్ పై క్రిమినల్‌ కేసు నమోదు

పవన్‌ కల్యాణ్ పై క్రిమినల్‌ కేసు నమోదు

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై  గుంటూరులో క్రిమినల్‌ కేసు నమోదైంది.  గతేడాది జూలై9వ తేదీన  వారాహి యాత్రలో భాగంగా వాలంటీర్లపై  ఆయన చేసిన కామెంట్స్ కు గానూ  ఈ కేసు నమోదైంది. గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరుకు చెందిన వాలంటీర్ పవన్ కుమార్ ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా పవన్ కల్యాణ్ పై కేసు నమోదైంది.  విచారణకు స్వీకరించిన  గుంటూరు నాలుగో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి పవన్‌కు నోటీసులు పంపారు.  2024  మార్చి 25న కోర్టుకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. 

గతేడాది జులై 9న ఏలూరులో వారాహి యాత్రలో  భాగంగా పవన్‌ కల్యాణ్‌ వాలంటీర్లపై  సంచలన వ్యాఖ్యలు చేశారు.  వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరి సమాచారం సేకరించి ఒంటరి మహిళలను గుర్తించి కొంతమంది సంఘ విద్రోహశక్తుల ద్వారా వల వేసి అపహరిస్తున్నారని ఆరోపించారు. ఇందులో వైసీపీ ప్రభుత్వంలోని కొందరు పెద్దల హస్తమున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు తనకు చెప్పినట్లు కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని  పవన్ ప్రస్తావించలేదు.