హైకమాండ్ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ నేతల కీలక భేటీ

హైకమాండ్ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ నేతల కీలక భేటీ

ఏఐసీసీలో తెలంగాణ కాంగ్రెస్ నేతల కీలక భేటీ మంగళవారం (జూన్ 27న) జరగనుంది. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నేతృత్వంలో మీటింగ్ జరగనుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో చర్చించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల ముఖ్యనేతలతో రాహుల్‌గాంధీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం (జూన్ 27న) ఢిల్లీలో తెలంగాణ నేతలతో భేటీ అవుతున్నారు. ఇందులో మాణిక్‌రావ్‌ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు ముఖ్యనేతలు మధుయాష్కిగౌడ్‌, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, పొదెం వీరయ్య, సీతక్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, దామోదర్‌ రాజనర్సింహ పాల్గొననున్నారు. సీఎల్పీ నేత భట్టి వెళ్లాల్సి ఉన్నా.. పాదయాత్రలో ఉన్నందున వెళ్లడంలేదు.

కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ మణిక్ రావు ఠాక్రే అధ్యక్షతన ప్రియాంక గాంధీతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సోమవారం (జూన్ 26న) సమావేశమయ్యారు. ఏఐసీసీ హెడ్ ఆఫీసులో జరిగిన ఈ భేటీలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, షబ్బర్ అలీ, మల్లు రవి, మహేష్ కుమార్ గౌడ్, సంపత్ కుమార్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. 

ALSOREAD:ఎలాంటి విచారణకైనా సిద్ధం.. డ్రగ్స్ కేసుపై స్పందించిన నటి జ్యోతి

తెలంగాణలో సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ సూచించారు. కేసీఆర్‌ హఠావో.. తెలంగాణ బచావో అన్న నినాదంతో ముందుకెళ్లాలన్నారు. కేసీఆర్‌ కుటుంబ పాలనను, అవినీతిని ప్రజల్లో మరింత బలంగా ఎండగట్టాలన్నారు. త్వరలో కాంగ్రెస్‌ లో చేరబోతున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సహా 35 మంది నేతలు సోమవారం ఢిల్లీలో రాహుల్‌, ఖర్గేలతో భేటీ అయ్యారు. వారిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్‌ అగ్రనేతలకు పరిచయం చేశారు. తాము జూలై 2న కాంగ్రెస్‌ లో చేరతామని పొంగులేటి, జూపల్లి తెలిపారు. ఆ రోజు ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని, అదేరోజు తాము చేరతామని, ఆ సభకు రావాలని రాహుల్‌గాంధీని పొంగులేటి ఆహ్వానించారు.