
నవ్విపోదురు గాక నాకేంటి.. అన్నట్లుగా ఉంది బిచ్కుంద మండలం పెద్ద తక్కడ్‌పల్లి పంచాయతీ అధికారుల తీరు.. ఇటీవల పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరడంతో అందులో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదు.
రిపేర్లు చేసి ఉపయోగించాల్సిన బిల్డింగ్‌ను ఇటు సిబ్బంది, అటు నాయకులు పట్టించుకోకపోవడంతో వృథాగా మారింది. దీంతో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పంచాయతీ భవనం వరండాను ఇలా కటింగ్ షాపుగా వాడుకుంటున్నాడు.
- పిట్లం, వెలుగు