V6 News

బావిలో పడిన జింక సేఫ్

బావిలో పడిన జింక సేఫ్

జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లి గ్రామ శివారులో ఓ జింక ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడింది. అటుగా వెళ్తున్న  గ్రామస్తులు దాన్ని చూసి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే వారు స్పాట్ కు చేరుకుని స్థానికుల సాయంతో బావిలోకి తాళ్లు వేసి అతికష్టం మీద జింకు పైకి లాగారు. అనంతరం దాన్ని అడవిలోకి క్షేమంగా వదిలిపెట్టారు. 

అడవిలో ఉండే జింక నీటి కోసమే తాటిపల్లి గ్రామ  శివారులోకి వచ్చినట్టు ఉంటుందని అటవీ అధికారులు చెబుతున్నారు. బావిలో పడిన జింకను బయటకు తీసేందుకు సహాయం చేసిన  గ్రామస్థులకు అధికారులు ధన్యవాదాలు తెలిపారు.