స్టూడెంట్స్ కు డెంగ్యూ వ్యాధిపై అవగాహన

స్టూడెంట్స్ కు డెంగ్యూ వ్యాధిపై అవగాహన

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ టౌన్ లోని హౌజింగ్ బోర్డ్ కాలనీలోని ఎస్టీ బాయ్స్ రెసిడెన్షియల్ కాలేజ్ లో మంగళవారం డెంగ్యూ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్త్ డిపార్ట్ మెంట్​ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్మూర్ సబ్ యూనిట్ హెల్త్ ఆఫీసర్ సాయి మాట్లాడుతూ.. డెంగ్యూ వ్యాధి ఏడిస్ దోమ వల్ల వ్యాప్తి చెందుతుందని,  ఈ దోమ పగలు మాత్రమే కుడుతుందని చెప్పారు. 

ఇంటి పరిసరాల్లో వర్షపు నీరు చేరకుండా చర్యలు తీసుకోమన్నారు. కార్యక్రమంలో డాక్టర్ మానస, సూపర్​వైజర్​ చంద్రశేఖర్, ప్రిన్సిపల్ జిలానీ, హెల్త్ అసిస్టెంట్లు ఆనంద్, మోహన్, ఆశా వర్కర్లు యమున, సలీమా పాల్గొన్నారు.