వరద నీటి నుంచి బయటపడేందుకు బాహుబలి తరహాలో..

 వరద నీటి నుంచి బయటపడేందుకు బాహుబలి తరహాలో..
  • 3 నెలల పసికందును బుట్టలో పెట్టి..  తలపై ఉంచుకుని సురక్షితంగా బయటపడ్డ కుటుంబం
  • పెద్దపల్లి జిల్లా మంథనిలో ఘటన

పెద్దపెల్లి జిల్లా: గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మంథని పట్టణంలో వరద బీభత్సం సృష్టించిన తీరు అంతా ఇంతా కాదు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. నడుము లోతు నీరు ఇండ్లలోకి వచ్చేయడంతో బయటపడేందుకు ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. మర్రివాడకు వరద ఉధృతి పెరగడంతో అక్కడి నుంచి బయట పడేందుకు ఓ కుటుంబం చాలా కష్టపడింది. బాహుబలి సినిమా తరహాలో మూడు నెలల బాలుడిని బుట్టలో పెట్టి.. ఆ బుట్టను తలపై ఉంచుకొని వరద నీటిని  దాటారు. కొన్ని చోట్ల వరద నీరు భుజాల వరకు వచ్చినా.. ఒక కుటుంబంలోని వారంతా..  ఒకరికి ఒకరు తోడుగా.. సురక్షితంగా బయటపడ్డారు. ఇళ్ల మిద్దెలపై ఉన్న కొందరు వరద నీటి బీభత్సాన్ని ఫోటోలు, వీడియోలు తీసి షేర్ చేయడంతో అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు.