మెస్సీ ముఖాన్ని హెయిర్ టాటూ వేయించుకున్న అభిమాని

మెస్సీ ముఖాన్ని హెయిర్ టాటూ వేయించుకున్న అభిమాని

అభిమానాన్ని చాటుకోవడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. కొందరు వాళ్ల అభిమాన స్టార్ డ్రెస్సింగ్ ఫాలో అవుతారు, మరికొందరు వాళ్లలా హెయిర్ స్టైల్  చేసుకుంటారు. ఆ స్టార్ లా కనిపించడానికి ప్రయత్నిస్తారు. మరీ వీరాభిమాని అయితే పేరునో, ఫొటోనో టాటూ వేయించుకుంటారు. అయితే, శాంటో డొమింగోలోని ఈ అభిమాని మాత్రం కొంచెం వింతగా ట్రై చేశాడు. తన జుట్టునే అర్జెంటీనా ఫుట్ బాల్ ఆటగాడు మెస్సీ ముఖంలా కట్ చేయించుకున్నాడు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుండటంతో ఆనంద్ మహీంద్ర తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు.

వెనిజులాకు చెందిన ఆంటోన్ అనే వ్యక్తి ఈ హెయిట్ కట్ చేశాడు. తన షాప్ కి వచ్చిన కస్టమర్ పై ఆ ఆర్ట్ వేశాడు. చూడ్డానికి అచ్చం పెన్సిల్ తో వేసిన బొమ్మలా కనిపిస్తున్న ఈ బొమ్మని ‘హెయిర్ టాటూ’ అంటారు. ట్రిమ్మర్ తో జుట్టు కత్తిరిస్తూ ఈ ఆర్ట్ వేస్తారు. 

ఆనంద్ మహీంద్ర పోస్ట్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికి 2.91 లక్షల వ్యూస్, 12.1 లైక్స్ వచ్చాయి. అయితే, ఈ వీడియో చూసిన వాళ్లంతా బార్బర్ టాలెంట్ ని మెచ్చుకుంటున్నారు.