విద్యుత్ షాక్ తో కౌలు రైతు మృతి.. నిజామాబాద్ జిల్లా జలాల్పూర్ లో ఘటన

విద్యుత్ షాక్ తో కౌలు రైతు మృతి.. నిజామాబాద్ జిల్లా జలాల్పూర్ లో ఘటన

వర్ని, వెలుగు: నిజామాబాద్​ జిల్లా వర్ని మండలం జలాల్​పూర్​లో ప్రమాదవశాత్తు విద్యుత్​ షాక్​తో కౌలు రైతు చనిపోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్ని మండలం సిద్దాపూర్​కు చెందిన సఖియా(52) జలాల్​పూర్​ శివారులో భూమిని కౌలుకు తీసుకొని పంట సాగు చేస్తున్నాడు. ఆదివారం ఉదయం సఖియా పంటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. బోర్​ మోటర్​ స్టార్ట్​ కాకపోవడంతో సమీపంలో ఉన్న విద్యుత్​ ట్రాన్స్​ఫార్మర్​  లైన్​ బంద్​చేసేందుకు వెళ్లి కరెంట్​ షాక్​కు గురయ్యాడు. కౌలు రైతు మృతితో సిద్దాపూర్​ లో విషాదం నెలకొంది. మృతుడికి కూతురు, కొడుకు ఉన్నారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.