షార్ట్ సర్క్యూట్........ 50 క్వింటాళ్ల పత్తి దగ్ధం.. ఆదిలాబాద్ జిల్లాలో ప్రమాదం

షార్ట్ సర్క్యూట్........  50 క్వింటాళ్ల పత్తి దగ్ధం.. ఆదిలాబాద్ జిల్లాలో ప్రమాదం

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్​జిల్లాలో అగ్నిప్రమాదంలో భారీగా పత్తి కాలిపోయింది.  జైనథ్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఎడవ్ దీపక్ ఇంటికి సోమవారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. 

స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. దీంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వెళ్లి  మంటలను ఆర్పివేశారు. కాగా అగ్ని ప్రమాదం కారణంగా ఇంట్లో నిల్వ ఉంచిన 50 క్వింటాళ్ల పత్తి దగ్ధమైనట్లు రైతు దీపక్ వాపోయాడు.