కరెంట్ షాక్ తో రైతు మృతి..మెదక్ జిల్లా వెంకట్రావుపేటలో ఘటన

కరెంట్ షాక్ తో రైతు మృతి..మెదక్ జిల్లా  వెంకట్రావుపేటలో ఘటన

కౌడిపల్లి, వెలుగు: పొలంలో కరెంట్​ షాక్​తో మెదక్​ జిల్లా కౌడిపల్లి మండలం వెంకట్రావుపేటలో ఓ రైతు చనిపోయాడు. గ్రామానికి చెందిన నీలం లక్ష్మీనారాయణ(38) మంగళవారం సాయంత్రం తన పొలంలో పనులు చేస్తుండగా, పొలంలో ఉన్న 11 కేవీ  ట్రాన్స్​ఫార్మర్  వద్ద కరెంట్​ షాక్  తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.