మై హోం సిమెంట్​ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం : 14 మంది కార్మికులు మృతి

మై హోం సిమెంట్​ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం : 14 మంది కార్మికులు మృతి

సూర్యాపేట : మేళ్లచెరువులోని మైహోమ్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగింది. 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ వర్క్ చేస్తుండగా లిఫ్ట్ కూలి కిందపడింది. ఉత్తరప్రదేశ్, బీహార్ కు చెందిన పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనుమతి లేకుండా సిమెంట్​ ఫ్యాక్టరీలో యూనిట్-4 ప్లాంట్ ను నిర్మిస్తున్నట్లు గుర్తించారు. దీంతో 14 మంది కాంట్రాక్ట్ కార్మికులు చనిపోయారు. 2023, జులై 25వ తేదీన ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంపై  మై హోమ్ కంపెనీ యాజమాన్యం గోప్యత పాటిస్తోంది.

ఓ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణంలో.. ఒకేసారి 14 మంది కార్మికులు చనిపోవటం అనేది సంచలనంగా మారింది. ఇంత పెద్ద ప్రమాదం జరగటం వెనక కారణాలు ఏంటీ అనేది బయటకు రావాల్సి ఉంది. ఆర్డీవో ఫ్యాక్టరీకి వచ్చి పరిశీలిస్తున్నారు. 500 అడుగుల ఎత్తు నుంచి లిఫ్ట్ ఒక్కసారిగా కిందకు పడటంతోనే.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.