హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో విషాధం. ఈనాడు కార్యాలయంలో పని చేస్తున్న సాయికుమారి అనే మహిళా ఉద్యోగి.. ఆఫీసులోని నాలుగో అంతస్తు నుంచి దూకి చనిపోయింది. ఈ ఘటన 2024, మార్చి 4వ తేదీ ఉదయం జరిగింది. కొన్నాళ్లుగా ఈనాడు కార్యాలయంలో కాల్ సెంటర్ లో పని చేస్తుంది సాయికుమారి. ఆఫీసుకు వచ్చిన సాయికుమారి.. అదే బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోవటం సంచలనంగా మారింది. సాయికుమారి భర్త కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఉద్యోగం చేస్తున్నారు. వీరి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనాడు కార్యాలయంలో పని చేసే మహిళా ఉద్యోగి సాయికుమారి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నది.. అది కూడా ఆఫీస్ విధుల్లో ఉండగా.. ఆఫీస్ బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోవటంతో ఉద్యోగులు షాక్ అయ్యారు. ఆత్మహత్యకు కారణాలు మాత్రం తెలియరాలేదు. విషయం జరిగిన వెంటనే.. ఫిల్మ్ సిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సాయికుమారి ఆత్మహత్యకు కారణాలపై ఇతర ఉద్యోగులను అడిగి తెలుసుకుంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
రెండు నెలల క్రితం కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ విషాధం జరిగింది. ఈవెంట్ లో భాగంగా.. క్రేన్ వైరు తెగిపోయి.. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ కో ఫౌండర్ చనిపోయారు. ఈ కంపెనీ ఈసీవో తీవ్రంగా గాయపడ్డారు. రెండు నెలల్లో రెండు విషాధ ఘటనలు రామోజీ ఫిల్మ్ సిటీలో జరగటం చర్చనీయాంశం అయ్యింది.
