చాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెంగ్ ఆస్పత్రి అగ్నిప్రమాదంలో 29 మంది మృతి

చాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెంగ్ ఆస్పత్రి అగ్నిప్రమాదంలో  29 మంది మృతి

బీజింగ్: బీజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని చాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెంగ్ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 29కి చేరింది. చనిపోయినవారిలో 26 మంది పేషెంట్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన 39 మందికి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఆస్పత్రిలోని మెడికల్ ఫెసిలిటీస్ హెడ్ తో సహా 12 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం చాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెంగ్ హాస్పిటల్లోని ఇన్ పేషెంట్ విభాగంలో రిపేర్ చేస్తుండగా మంటలు చెలరేగాయి.  దాంతో కొంతమంది రోగులు కిటికీల నుంచి బయటకు దూకేశారు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 71 మంది పేషెంట్లను ఇతర ఆస్పత్రులకు తరలించారు. ఈ క్రమంలోనే 29 మంది చనిపోయారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి.