400 మంది పిల్లలు ఉన్న స్కూల్ లో మంటలు : ఆలస్యం అయ్యి ఉంటే ఘోరం జరిగేది..!

400 మంది పిల్లలు ఉన్న స్కూల్ లో మంటలు : ఆలస్యం అయ్యి ఉంటే ఘోరం జరిగేది..!

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో  విద్యార్థులకు  పెను ప్రమాదం తప్పింది. పత్తిపాడు నియోజకవర్గం  ప్రత్తిపాడు మండలం ప్రతిపాడు భవనం వెంకటరెడ్డి జిల్లా పరిషత్ పాఠశాలలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.  ప్రమాదం సమయంలో స్కూల్లో 400 మంది విద్యార్థులు ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో  గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు.  మంటలు చెలరేగటం గమనించిన వెంటనే స్కూల్లోని పిల్లలందరినీ బయటికి తీసుకెళ్లారు ఉపాధ్యాయులు. పెద్ద ప్రమాదం తప్పిందని ఎవరికి ఎలాంటి హాని జరగకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.  సంఘటనా స్థలానికి  గ్రామస్తులు భారీగా చేరుకున్నారు. 

ఉపాధ్యాయులు  ఏమాత్రం అప్రమత్తంగా లేకున్నా..కాస్త ఆలస్యం అయినా  ఇవాళ ఘోరం జరిగేది..400 మంది విద్యార్థులున్న ఈ స్కూల్లో ఉపాధ్యాయులు త్వరగా  అలర్ట్ కావడం వల్లే ప్రమాదం తప్పింది.విద్యార్తుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

►ALSO READ | శ్రీశైలం ఘాట్ రోడ్దు దగ్గర తుపాకీ కలకలం

 స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మండలను అదుపులోకి తెచ్చారు. దట్టమైన పొగలు అలుముకోవడంతో మంటలు ఆర్పేందుకు  సమయం పట్టింది.  తీవ్రంగా శ్రమించిన ఫైర్ సిబ్బంది ఎట్టకేలకు మంటలను అదుపులోకి తెచ్చారు.  కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనకు గల కారణాలేంటనే దానిపై ఆరాదీస్తున్నారు.