పాతబస్తీలో ఐదేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి.. తీవ్ర గాయాలు

పాతబస్తీలో ఐదేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి.. తీవ్ర గాయాలు

గ్రేటర్ హైదరాబాద్ లో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులపై దాడులు చేస్తున్నాయి. తాజాగా మరో ఘటన కలకలం రేపుతోంది. మంగళవారం (మే 30న) పాతబస్తీ సంతోష్ నగర్ కాలనీలో ఓ బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. ఐదేళ్ల అబ్దుల్ రఫీ అనే బాలుడు పిల్లలతో కలిసి తమ ఇంటి ముందు ఆడుకుంటుండగా.. అక్కడే ఉన్న ఓ కుక్క పరుగెత్తుకుంటూ వచ్చి దాడి చేసింది. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. 

కుక్క దాడి చేసే సమయంలో ఓ వ్యక్తి తన వాహనంపై అటువైపు వెళ్తున్నాడు. వెంటనే తన బైక్ ను ఆపాడు. బాలుడి అరుపులను విన్న స్థానికులు కూడా క్షణాల్లో అలర్ట్ అయ్యారు. అందరూ కలిసి కుక్కను తరిమికొట్టి.. అబ్దుల్ రఫీని రక్షించారు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు కక్కును తరిమికొట్టడంతో బాలుడు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. 

ప్రస్తుతం బాలుడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీధి కుక్కలపై జీహెచ్ఎంసీ అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాలుడి తల్లిండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కుక్కల నియంత్రణకు స్థానిక అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు కోరుతున్నారు.