హైదరాబాద్ బావర్చి బిర్యానీలో ఈగ!

హైదరాబాద్ బావర్చి బిర్యానీలో ఈగ!
  • అని సమాధానం ఇచ్చిన సిబ్బంది
  • ఫుడ్​ సేఫ్టీ ఆఫీసర్​కు బాధితుడి ఫిర్యాదు

హైదరాబాద్​, వెలుగు : ఆర్టీసీ క్రాస్​ రోడ్స్​లోని బావర్చి రెస్టారెంట్​లో బిర్యానీ పార్సిల్​ తీసుకెళ్లిన ఓ వ్యక్తి.. దాన్ని తింటుండగా చనిపోయిన ఈగ బయటపడింది. వివరాల్లోకి వెళ్తే..  రాంనగర్​కు చెందిన రవి శుక్రవారం మధ్యాహ్నం 1.40 గంటలకు బావర్చిలో రూ. 350 చెల్లించి.. చికెన్​ ఫుల్​బిర్యానీ, మినీ మటన్​ బిర్యానీ పార్సల్​ తీసుకొని ఇంటికి వెళ్లాడు. మటన్​ బిర్యానీ ఓపెన్​ చేసి  కుటుంబసభ్యులతో కలిసి తింటుండగా.. అందులో చనిపోయిన ఈగ బయటపడింది. ఆ  పార్సిల్​​ను రవి తిరిగి బావర్చి రెస్టారెంట్​ కు తీసుకెళ్లి అక్కడి సిబ్బందికి చూపించాడు. కౌంటర్​లో ఉన్న సిబ్బంది ‘మిస్టేక్​లో వచ్చింది.. ’ అని చెప్తూ మరో బిర్యానీ ప్యాకెట్​ఇవ్వడానికి ప్రయత్నించాడు. 

మీ బిర్యానీ అక్కర్లేదు.. ఎందుకు ఇట్ల వచ్చింది. అసలే వానాకాలం. ఫుడ్​ పాయిజన్​ అయితే ఎవరు బాధ్యులు’ అని రవి ప్రశ్నించాడు. సార్.. మిస్టేక్​లో వచ్చి ఉంటుంది.. మరో ప్యాకెట్​ తీసుకోండి’ అంటూ దాట వేయడానికి ప్రయత్నించాడు. దీనిపై ముషీరాబాద్ ​ఫుడ్ ​సేఫ్టీ ఆఫీసర్​కు బాధితుడు ఫిర్యాదు చేశాడు. గతంలోనూ బావర్చి బిర్యానీపై అనేక ఫిర్యాదులు ఉన్నాయి. 

ఆ మధ్య ఫుడ్​లో బల్లి వచ్చిందని స్థానిక కార్పొరేటర్ ​ఆందోళనకు కూడా దిగారు. బావర్చిలో బిర్యానీ కొంటే ఈగ వచ్చింద ఘటనపై తమకు ఫిర్యాదు అందిందని జీహెచ్ఎంసీ గెజిటెడ్ ఫుడ్ ఇన్ స్పెక్టర్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. శాంపిల్​ను తీసుకుని ల్యాబ్​కు పంపుతామన్నారు. ఆ తర్వాత విచారణ జరిపి షోకాజ్ నోటీసు జారీచేస్తామని ఆయన చెప్పారు. ఫుడ్ క్వాలిటీ నాసిరకంగా ఉన్నట్లైతే రెస్టారెంట్ లైసెన్స్ రద్దు చేస్తామన్నారు.