హైదరాబాద్ లో విదేశీయుడి హత్య

హైదరాబాద్ లో విదేశీయుడి హత్య

హైదరాబాద్ లో విదేశీ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.  హుమయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టోలిచౌకిలో  ఓ సోమాలియన్ ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.   ఈ ఘటనతో  స్థానికులు  ఒక్కసారిగా  భయాందోళనకు గురయ్యారు


స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం డెబ్ బాడీని ఆస్పత్రికి తరలించారు.  ఈ హత్య ఎవరు చేశారు ఎందుకు చేశారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.