వరదలో కొట్టుకుపోయి నాలుగేళ్ల చిన్నారి మృతి

V6 Velugu Posted on Nov 24, 2021

చిత్తూరు జిల్లాలో వర్షాలు తగ్గినా వరదలు కొనసాగుతున్నాయి. వరద బీభత్సానికి జిల్లాలో మరో విషాదం చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారి వరదలో కొట్టుకుపోయి మృతి చెందిన ఘటన ఒక కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. తంబళ్లపల్లె మండలం, గుండ్లపల్లె గ్రామం వేపలపల్లె వద్ద టూవీలర్ ఏరు దాటుతూ ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో తండ్రి, ఇద్దరు కొడుకులు వరదలో కొట్టుకుపోయారు. కుమారుడు తేజస్ (4) మృతి చెందగా.. స్థానికుల సాయంతో తండ్రి శ్రీరాములు, రేవంత్ ను పోలీసులు కాపాడారు. 

Tagged Andhra Pradesh, Chittoor District, floods, Heavy rains, child died, Tamballa Palle Mandal

Latest Videos

Subscribe Now

More News