బైకులు చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

బైకులు చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

నల్లగొండ జిల్లాలో విలువైన బైక్ లు చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. ఏపీ, తెలంగాణలో చోరీ చేసిన 67 బైకులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 90 లక్షల రూపాయల విలువైన 20 బుల్లెట్ బైక్ లు, 44 పల్సర్ బైక్ లు, ఒక టీవీఎస్ అపాచీ, ఒక స్కూటీని సీజ్ చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వెంకటేష్, శబరీశ్, అంకమ్మ రావు, శ్రీకాంత్, వేణులు ఏపీలోని నర్సరావుపేట  వాసులుగా గుర్తించారు. వారి నుంచి 5 సెల్ ఫోన్లు, ఒక డమ్మీ పిస్టల్ ను రికవరీ చేశారు.