
సంగారెడ్డి జిల్లా ముత్తంగిలో ఓ దొంగల ముఠా… ఏటీఎమ్ చోరీకి ప్రయత్నించి పోలీసులకు పట్టుబడింది. ముత్తంగిలో కోటక్ మహేంద్ర ఏటీఎమ్ మెషిన్ బద్దలు కొడుతున్న టైంలొనే పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో ఆ ముఠా తప్పించుకోలేకపోయింది. దీంతో వారిని లైవ్ లొనే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు. ఏటిఎం సెంటర్ లో ఏర్పాటు చేసిన టెక్నాలజీ వల్ల ముంబైలోని బ్యాంక్ కార్యాలయానికి సెక్యురిటీ అలెర్ట్ వెళ్లింది. దీంతో అక్కడి అధికారులు వెంటనే హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్ సిటీ కమాండ్ కంట్రోల్ తో అప్రమత్తం అయిన సిటీ పోలీసులు.. ముత్తంగి పోలీసులకు సమాచారం ఇచ్చారు . వెంటనే పక్కా ప్లానింగ్‌తో ముత్తంగి పోలీసులు ఆ దొంగల ముఠాను పట్టుకున్నారు.