బొట్టు పెట్టుకుందని కొట్టిన టీచర్​.. స్టూడెంట్​ ఆత్మహత్య

బొట్టు పెట్టుకుందని కొట్టిన టీచర్​.. స్టూడెంట్​ ఆత్మహత్య

ధన్​బాద్: జార్ఖండ్​లో దారుణం చోటుచేసుకుంది. స్కూల్​కు బొట్టు పెట్టుకుని వచ్చినందుకు బాలికను టీచర్ కొట్టాడు. దీంతో ఆ బాలిక మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ధన్​బాద్ జిల్లాలోని టేతుల్మారి ఏరియాలో ఉన్న ప్రైవేట్ స్కూల్​లో ఓ బాలిక చదువుకుంటున్నది. ఆమె సోమవారం స్కూల్​కు బొట్టు పెట్టుకుని వెళ్లగా.. టీచర్ కొట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక.. ఇంటికొచ్చాక ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో బాలిక పేరెంట్స్ స్కూలు ముందు మంగళవారం ఆందోళన చేపట్టారు. స్కూల్ మేనేజ్ మెంట్ తీరుపై బాలిక తల్లిదండ్రులు, స్థానికులు మండిపడ్డారు. పోలీసులు వచ్చి టీచర్​ను అరెస్టు చేశారు. కాగా, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ చైర్ పర్సన్ ప్రియాంక్ కానూంగో తెలిపారు.