టేకాఫ్ కు సిద్దంగా విమానం..దూసుకొచ్చిన కారు

టేకాఫ్ కు సిద్దంగా విమానం..దూసుకొచ్చిన కారు

ఢిల్లీలోని ఐజీఐ ఎయిర్ పోర్టులో ఇండిగో విమానం కింద మారుతి కారు ఆగిపోయింది. టర్మినల్ 2 వద్ద టేకాఫ్ కు సిద్ధంగా ఉన్న విమానం కిందికి గో ఫస్ట్ కు చెందిన కారు దూసుకెళ్లింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలవ్వలేదు. ఈ విమానం ఢిల్లీ నుంచి పాట్నా వెళ్లాల్సివుంది. అయితే డ్రైవర్ మద్యం మత్తులో కారు నడిపాడన్న అనుమానంతో అతడికి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు. అయితే అందులో నెగిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. కాగా షెడ్యూల్ ప్రకారమే విమానం టేకాఫ్ అయింది. ఈ ఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది.