వయసు పెరుగుతున్న కొద్దీ మంచి డైట్ అవసరం

వయసు పెరుగుతున్న కొద్దీ మంచి డైట్ అవసరం

యాభై ఏండ్ల వయసు రాగానే ఈ మధ్య కాలంలో కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు చాలామంది. ఎముకలు మెత్తబడటం వల్ల ఇలా జరుగుతుంది. దీన్నే ‘ఆస్టియోపొరోసిస్‌’ (బోలు ఎముకల వ్యాధి) అంటారు. దీని వల్ల కీళ్లు అరగడం, చిన్న ప్రమాదానికే ఎముకలు విరగడం లాంటివి జరుగుతాయి.  

ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరికి, నలుగురు పురుషుల్లో ఒకరికి ఈ సమస్య ఉంది. డైట్‌ ఫాలో కాకపోవడం, సరైన ఎక్సర్‌‌సైజ్‌ చేయకపోవడం, ఉండాల్సిన దానికన్నా బరువు ఎక్కువ ఉండటం ఆస్టియోపోరోసిస్‌కు కారణాలు. ఇవేకాకుండా పొగతాగడం, మద్యపానం, హార్మోనల్‌ ఇంబ్యాలెన్స్‌, అనవసరంగా మందులు వాడటం కూడా ఆస్టియోపొరోసిస్‌కు కారణాలే‌ అంటున్నాడు డాక్టర్‌ వీరేంద్ర ముదునూర్‌‌. 

  • విటమిన్ – డి ఎముకలు బలంగా ఉండేలా చేస్తుంది. ఆహారం నుంచి క్యాల్షియం, మినరల్స్‌, న్యూట్రియెంట్స్​ను ఎముకలు అందుకోవాలంటే విటమిన్‌ – డి అవసరం. రోజూ ఉదయం 10 నిమిషాలు ఎండలో ఉన్నా శరీరానికి విటమిన్‌ – డి అందుతుంది. కాల్షియం ఎక్కువగా ఉన్న పాలు, పాల ఉత్పత్తులు, ఆకు కూరలు, పప్పులు, చేపలు రోజూ తింటే ఎముకలు దృఢంగా ఉంటాయి.
     
  • ఎముకల ఆరోగ్యానికి ఎక్సర్‌‌సైజ్ సాయపడుతుంది. ఎక్సర్‌‌సైజ్‌లతో పాటు నడవటం, ట్రెక్కింగ్‌, జాగింగ్‌, మెట్లు ఎక్కడం లాంటివి కూడా చేయొచ్చు. 
     
  • పొగ తాగడం, మద్యపాన అలవాట్లు ఉంటే మానుకోవాలి. ఈ అలవాట్ల వల్ల క్యాన్సర్‌‌, హార్ట్‌ ఎటాక్‌లతో పాటు ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడే కణాలు డెవలప్‌ కావు.   
  • వయసు పెరుగుతున్న కొద్దీ మంచి డైట్ అవసరం. దాని వల్ల ఎముకలు బలపడతాయి. మెనోపాజ్‌ ఆగిపోయాక మహిళల్లో ఈ సమస్య మొదలవుతుంది. అందుకే అప్పటి నుంచి ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.
  •  పసివాళ్లుగా ఉన్నప్పటి నుంచే ఎముకల పెరుగుదల మొదలవుతుంది. కాబట్టి అప్పటి నుంచే కాల్షియం మంచిగా ఉన్న ఆహారం పెడితే ఎముకలు దృఢంగా అవుతాయి. వయసు వచ్చాక ఆస్టియో పొరోసిస్‌ బారిన పడకుండా చేస్తాయి.