
చిలకలగూడ, మారేడ్‌పల్లిలో ఫలహార బండ్ల ఊరేగింపులు ఘనంగా జరిగాయి. భారీ లైటింగ్‌తో ఆలయ పరిసరాలు దేదీప్యమానంగా వెలిగాయి. వివిధ వాయిద్యాలతో పలు చోట్ల నుంచి ఫలహార బండ్ల ఊరేగింపులు సంప్రదాయ బద్ధంగా ఆలయాలకు చేరుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మారేడ్ పల్లిలో గొల్ల కిట్టు ఆధ్వర్యంలో నిర్వహించిన ఫలహారబండ్ల ఊరేగింపు అందరిని ఆకట్టుకున్నాయి