
ఢిల్లీ: అమరావతి రాజధాని (Amaravati Capital) పై మార్చి 28వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు (Highcourt) తీర్పుపై స్టే విధించాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వ (AP Govt) పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పును యధాతథంగా అమలు చేయాలని రైతులు పిటిషన్ వేశారు. 2 పిటిషన్లను జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ బి.వి. నాగరత్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది.
విభజన చట్టం ప్రకారమే అమరావతి ఏర్పడిందని కేంద్రం అఫిడవిట్ ను దాఖలు చేసింది. 3 రాజధానుల గురించి తమకు తెలియదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఏపీ రాజధానిపై మార్చి 28వ తేదీన సుప్రీంకోర్టు విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.