ఆ చంటోడికి అమ్మే హీరో..!

 ఆ చంటోడికి అమ్మే హీరో..!

తల్లి ప్రేమ ఎంత గొప్పదో మాటల్లో చెప్పలేం. పిల్లల ఆలన, పాలన కోసం అమ్మ పడే యాతన అంతా ఇంతా కాదు. ఎన్ని కష్టాలకోర్చయినా తన బిడ్డకు వెలుగునిస్తూనే ఉంటుంది. అటువంటి అమ్మతనానికి అద్దం పట్టే దృశ్యమే ఇది. మదర్స్ డేను పురస్కరించుకొని శనివారం ‘వెలుగు’ క్లిక్ మనిపించింది. 

ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు జరుగుతుండగా, బయట రాష్ట్రానికి చెందిన ఓ తల్లి తన బిడ్డను ఒంటరిగా వదిలేయకుండా ఇలా వెంట పెట్టుకొని ఎర్రటి ఎండలో పనులు చేసుకుంటోంది. బిడ్డను నీడ పట్టున ఉంచి మధ్యమధ్యలో అన్నం, నీళ్లు ఇచ్చి వస్తోంది. అమ్మ కష్టాన్ని చూడలేక ఆ చంటోడు సైతం ఎండలో తోచినంత ఉడత సాయం చేస్తున్నాడు.   -  ఖమ్మం, వెలుగు ఫొటోగ్రాఫర్