ఇదెక్కడి టేస్ట్ రా మామా... దోశలో ఆలూకి బదులుగా పాన్ మసాలా

ఇదెక్కడి టేస్ట్ రా మామా... దోశలో ఆలూకి బదులుగా పాన్ మసాలా

మనం రోజూ ఇష్టంగా తినే ఫుడ్ అప్పుడప్పుడూ బోర్ కొట్టి ఏదైనా కొత్త టేస్ట్ ట్రై చేయాలని అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించినప్పుడు  కొత్త టేస్ట్ లు ట్రై చేస్తూ ఉంటాం. కొత్త రెసిపీలు ట్రై చేసినప్పుడు అది సక్సెస్ అయితే ఒకే, తేడా కొడితే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది. చాలా మంది దోశలో రకరకాల రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటారు.వాటిలో కొన్ని అద్భుతమైన టేస్ట్ ని ఇస్తే, మరికొన్ని చెత్త టేస్ట్ ని ఇస్తూ ఉంటాయి. అలాంటి కొత్త రెసిపీ దోశ ఒకటి వెలుగులోకి వచ్చింది. సూరత్ లోని ఒక హోటల్ ఈ కొత్త రెసిపీకి వేదిక కాగా, అందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది.

వీడియోలో చెఫ్ దోశ పాన్ మీద ఆకు పచ్చని దోశపిండి వేసి దాని మీద పాన్ మసాలాకి సంబంధించిన ఐటమ్స్ అన్ని వేస్తున్నాడు. బహుశా తమలపాకును ఆ దోసెపిండిలో కలిపాడేమో, అందుకే ఆ పిండి ఆకుపచ్చ రంగులో ఉంది. పాన్ మసాలా ఐటమ్స్ అన్ని వేసాక దోశ కాలాక, పాన్ స్టైల్ లో ఆ దోశను కట్ చేసి కస్టమర్స్ కి అందిస్తున్నాడు చెఫ్. చూడటానికి వింతగా ఉన్న ఈ దోశ టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి చుడండి.