గన్ పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు.. 17 మంది మృతి

గన్ పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు.. 17 మంది మృతి

చత్తీస్ ఘడ్ బమేతర జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బెర్లా బ్లాక్‌ బోర్సి గ్రామంలోని  గన్ పౌడర్ తయారీ ఫ్యాక్టీరలో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో గన్‌పౌడర్‌ ఫ్యాక్టరీలో సుమారు 100 మంది పనిచేస్తున్నట్లు సమాచారం. 

 పేలుడు శబ్ధంతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. సమాచారం అందుకున్న జిల్లా యంత్రాంగం, పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది.  రాయ్‌పూర్,  దుర్గ్ నుండి అగ్నిమాపక వాహనాలు ,  20 మంది సభ్యుల SDRF రెస్క్యూ టీమ్  సహాయక చర్యలు చేపట్టారు. క్షతాగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. 

 శిథిలాల కింద పలువురు ఉన్నట్లు అనుమానిస్తున్నారు అధికారులు.  మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారిస్తున్నారు.