ఉద్యోగులకు కార్లు, బైకులు గిఫ్ట్ ఇచ్చిన నగల దుకాణం యజమాని

ఉద్యోగులకు కార్లు, బైకులు గిఫ్ట్ ఇచ్చిన నగల దుకాణం యజమాని

ఉద్యోగులకు పండగల వేళ స్వీట్ బాక్సులు ఇవ్వడమే గగనమయ్యే ఈ రోజుల్లో ఓ యజమాని మాత్రం ఏకంగా కార్లు, బైకులు బహుమతిగా ఇచ్చాడు. దీపావళి  కానుకగా..తమ ఉద్యోగులకు ..రూ. 1.2 కోట్లు విలువ చేసే కార్లు, బైకులు అందించాడు. తమ యజమాని కార్లు, బైకులు ఇవ్వడంపై కొందరు ఉద్యోగులు ఆశ్చర్యపోగా..మరికొందరు సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.

సర్ప్రైజ్ గిఫ్టులు
జయంతి లాల్‌ అనే నగల వ్యాపారీ..తమిళనాడులోని  చెన్నైలో జ్యువెల్లరీ షాప్ నిర్వహిస్తున్నాడు. ఈ నెల 24 దీపావళి పండగ ఉంది. ఈ నేపథ్యంలో తమ ఉద్యోగులకు దీపావళి కానుకలు ఇవ్వాలని భావించాడు. పండగ వేళ వారందరికి సర్ ప్రైజ్ గిఫ్టులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఉద్యోగుల కోసం కార్లు, బైకులు కొన్నాడు. రూ. 1.2 కోట్లు విలువ చేసే 10 కార్లు, 20 బైకులను దీపావళి కానుకగా ఉద్యోగులకు అందించాడు. 

ఉద్యోగులను గౌరవించాలి..
నా జ్యువెల్లరీ షాప్ లో పనిచేసే ఉద్యోగులు  నా కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటున్నారు. నాకు లాభాలను తెచ్చిపెట్టారు. వారిని నా కుటుంబ సభ్యులుగా భావిస్తా. నా ఉద్యోగులను నేను గౌరవస్తా. పండుగ సందర్భంగా వారికి ఏదైనా సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇవ్వాలనుకున్నా. కార్లు, బైక్‌లు బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపర్చాలని నిర్ణయించుకున్నా. ఈ బహుమతులు వారిని ప్రోత్సహిస్తాయని నమ్ముతున్నా...అని నగల దుకాణం యజమాని జయంతి లాల్ తెలిపారు.