గోదావరిలో కార్తీక పుణ్యస్నానాలు

గోదావరిలో కార్తీక పుణ్యస్నానాలు

భద్రాచలం,వెలుగు : కార్తీకమాసం మూడో సోమవారం వేళ గోదావరిలో పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు గోదావరి తీరానికి చేరుకుని కార్తీక దీపాలు వెలిగించి, నదికి హారతి ఇచ్చారు. సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. శివాలయాల్లో అభిషేకాలు జరిగా యి. శివునికి బిల్వపత్రాలతో అర్చనలు చేశారు. 

పునర్వసు దీక్షలు

కార్తీక పునర్వసు నక్షత్రం వేళ భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామికి సోమవారం స్నపన తిరుమంజనం నిర్వహించారు.  గర్భగుడిలో స్వామి మూలవరులకు సుప్రభాత సేవ చేసి..బాలబోగం నివేదించారు. మూలవరులకు,  లక్ష్మీతాయారు అమ్మవారు, ఆంజనేయస్వామిలకు ముత్తంగి సేవ  చేశారు. కల్యాణమూర్తులకు నిత్య కల్యాణం జరిగింది.  కార్తీక పునర్వసు నక్షత్రం సందర్భంగా  20‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌0 మంది భక్తులకు భద్రుని మండపంలో ప్రధానార్చకులు అమరవాది విజయరాఘవన్ పునర్వసు దీక్షలు ఇచ్చారు. తర్వాత చిత్రకూట మండపంలో  సత్యనారాయణస్వామి వ్రతాలు చేశారు.