వాహనం ఢీకొని చిరుతపులి మృతి

వాహనం ఢీకొని చిరుతపులి మృతి

నిజామాబాద్ జిల్లా : ఇందలవాయి మండలం చంద్రాయన్ పల్లి గ్రామంలోని NH 44 జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుతపులి మృతిచెందింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనాస్థలానికి వెళ్లారు. మృతిచెందిన చిరుతపులిని అంబులెన్స్ లో తీసుకెళ్లారు. ఈ ఘటన సుమారు నిన్న రాత్రి 11 గంటల 50 నిమిషాలకు జరిగినట్లు చెబుతున్నారు.