కలెక్టర్ నివాసంలోకి చొరబడ్డ చిరుతపులి

 కలెక్టర్ నివాసంలోకి చొరబడ్డ చిరుతపులి

తమిళనాడులోని నీలగిరి జిల్లా కలెక్టర్ నివాసంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. ఏకంగా నీలగిరి జిల్లా కలెక్టర్ నివాసంలోకి చొరబడింది. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ని అధికారులు విడుదల చేశారు. అర్థరాత్రి కలెక్టర్ నివాసంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. చుట్టూ అడవి.. దుప్పి, జింకలు తదితర వణ్యప్రాణుల సంచారం ఉండే ఈ ప్రాంతాల్లో ఆహారం కోసం వేటాడుతూ ఇటువైపు వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు. చిరుత సంచారం గురించి సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు చిరుత కోసం గాలిస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి

కర్ణాటకలో జేపీ నడ్డా పర్యటన

సారవంతమైన సాగుభూములను లాక్కుంటే అడ్డుకుంటాం

ప్రజలేం తినాలో ప్రభుత్వం నిర్ణయించదు

ఉక్రెయిన్ సైనికులకు రష్యా అల్టిమేటం